కృష్ణా రోడ్డు ప్రమాదంపై  సీఎం వైయ‌స్ జగన్‌ దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా

అమరావతి: కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం అధికారులతో తెలిపారు.

 ఆదివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందినవారంతా నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతకముందు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 

తాజా ఫోటోలు

Back to Top