ఆత్మీయ ప‌ల‌క‌రింపు

కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో వైయ‌స్‌ జగన్‌ మమేకం
 

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైయ‌స్‌ జగన్‌ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

👉వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైయ‌స్‌ జగన్‌ భరోసానిచ్చారు.

👉 వైయ‌స్‌ జగన్‌ పులివెందులలోకి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

👉 క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ముఖ్య నాయకులతో వైయ‌స్‌ జగన్‌ సమావేశమయ్యారు. 


👉 వైయ‌స్‌ జగన్ మోహన్‌ రెడ్డి వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు.


👉 ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిశారు.

👉 వైయ‌స్ఆర్‌ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్సార్‌సీపీ నేత కుటుంబాన్ని వైయ‌స్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

👉 ఇక, రేపు ఇడుపులపాయలో దివంగత వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకులకు వైయ‌స్‌ జగన్‌ హాజరుకానున్నారు. 

Back to Top