రామోజీరావు మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రామోజీరావు కుటుంబానికి త‌న‌ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు. 

Back to Top