రాష్ట్ర న‌లుమూల‌లా ప్ర‌జా సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ

మ‌హానేత వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు నివాళులు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న పార్టీ శ్రేణులు

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు ఆవిష్క‌ర‌ణ‌

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం.. చరిత్రాత్మకం. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకు రావాలన్న సంకల్పంతో వైయ‌స్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి నాలుగు అయిన సంద‌ర్భంగా రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పండుగ‌లా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాలుల‌ర్పిస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం చేస్తున్నారు. అన్ని కూడ‌ళ్ల‌లో వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు ఎగుర‌వేసి వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు.

చిత్తూరులో..

ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసికున్న  సందర్భంగా వైయ‌స్సార్‌ విగ్రహనికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్ లో వైయ‌స్సార్‌ విగ్రహం వద్ద సర్వమత ప్రార్ధనలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తుడా వైయ‌స్సార్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషా, కార్పొరేటర్‌లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 10 ఏళ్లు పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు.

నాడు వైయ‌స్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యింది. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్‌ జగన్‌కే పట్టం కట్టారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 

వైయ‌స్సార్‌సీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి: ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ఊరూరా సంబ‌రాలు..
వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైయ‌స్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో వైయ‌స్‌ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోయిందని అంటున్నారు.

వైయ‌స్సార్‌ జిల్లా
ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపల్లెలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుండి రాయచోటి బైపాస్‌లో ఉన్న వైయ‌స్సార్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్ది, ఎంపీపీ గాయత్రి, కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top