వైయ‌స్ జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు

ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌

తాడేప‌ల్లి:  విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేద‌ని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్ అన్నారు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్ ఈ సందర్భంగా నిక్ మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ మఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం.ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది... ఇది అందరికీ తెలియాల్సి ఉంది. ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్‌ ఈజ్  ఆల్టిట్యూడ్‌ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. విద్యారంగంలో  అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి. 
ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి. ఆయనను కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. 

ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్‌.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

Back to Top