సీఎం రాక కోసం వేచిచూస్తున్న విశాఖ

నేడు విశాఖలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

విశాఖ: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం విశాఖ ఎదురుచూస్తోంది. జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర వాసులంతా ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారంతా ఫ్లెక్సీలు, తోరణాలు, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించినందుకు థాంక్యూ జగనన్న అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు విశాఖలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయం చేరుకోనున్న సీఎంకు దారిపొడవునా స్వాగతం పలికేందుకు జనం సన్నద్ధమయ్యారు. ఎన్‌ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, చినవాల్తేరు, కురుపాం టూంబ్, అప్పూఘర్‌ జంక్షన్‌ మీదుగా కైలాసగిరి చేరుకోనున్న ముఖ్యమంత్రికి కనీవినీ ఎరుగని రీతిలో 24 కిలోమీటర్ల మేర మానవహారంలా నిలబడి స్వాగతం పలకనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్‌ పార్క్‌ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో  సీఎంకు థాంక్స్‌ చెప్పనున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top