టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..?

వైయ‌స్ఆర్‌ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి 
 

తాడేప‌ల్లి : టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? వైయ‌స్ఆర్‌ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌శ్నించారు. బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.  ' ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారని ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
 

Back to Top