కేంద్రమే జోన్లవారి సడలింపులు ఇచ్చింది ఇప్పుడు ఏమంటారు?   

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు  
 

విజయవాడ: సీఎం వైయస్‌ జగన్‌  జోన్ల గురించి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు తప్పు బట్టారు. కేంద్రమే జోన్లవారి సడలింపులు ఇచ్చింది ఇప్పుడు ఏమంటారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షల పరిస్థితి అర్థం కావడం లేదని, మంచి పాలన చేస్తున్నా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  కరోనాపై కొన్నాళ్లు యుద్ధం తప్పనిసరి అని మేధావులే అంటున్నారని, ప్రతిపక్షలు ఆవుడేటెడ్‌గా మారిపోయాయని ఎద్దేవా చేశారు.  కరోనా కేసులు దాచిపెడుతున్నారంటూ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం విజయవాడలో పేదలకు, బ్రాహ్మణులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి
కరోనా టెస్టులు చేయడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా కరోనా టెస్టులు నిర్వహించామని వెల్లంపల్లి గుర్తుచేశారు. రోజుకు 7 నుంచి 8 వేల టెస్టులు చేస్తున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముడు దఫాలుగా ఉచిత రేషన్ ఇచ్చాము, ఇంటికే ఫించన్లు డోర్ డెలివరీ చేస్తున్నామని ఆయన తెలిపారు.  హైదరాబాద్ క్వారంటైన్‌లో ఉన్న టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

ఒక వైపు సంక్షేమం..మరోవైపు కరోనా నియంత్రణ చర్యలు
కరోనా నివారణకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆపద సమయంలోనూ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జగనన్న విద్యాదీవెన, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ పథకాలు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు రాజకీయల కోసం దిగజారి మాట్లాడం బాధాకరమన్నారు. ప్రతిపక్షలు నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

 కరోనా కేసుల సంఖ్య దాచి పెడుతున్నామంటున్నారని, దాస్తే దాగేది కాదని గుర్తుంచు కోవాలన్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు, యెల్లో మీడియాతో కలిసి ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ వారిగా ఒక ప్రణాళికలతో ముందకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం జోన్లవారిగా కొన్నినామ్స్ ప్రకటించిందని తెలిపారు. 

ఎవరైనా కోరుకుంటారా?
సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కరోనా నివారించేందుకు పూర్తిస్థాయిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏ మొహం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం సక్రమంగా పేద ప్రజలకు సంక్షేమం అందేలా పాలన అందిస్తోందని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్‌ లక్ష్యమని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కారణం అంటూ విమర్శలు చేస్తున్నారని, వైరస్ వ్యాప్తి చెందాలని ఎవరైనా కోరుకుంటారా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు.

దివాళాకోరు విమర్శలు మానుకోవాలి 
2017లో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రపంచంలోనే ఎయిడ్స్ వ్యాప్తి ఏపీ ముందజలో ఉందని కథనం రాశారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఎయిడ్స్‌ను వ్యాప్తి చెందేలా చేసిందని దాని అర్థమా అని ప్రశ్నించారు. విమర్శలు చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దివాళాకోరు విమర్శలు మానుకోవాలి హితవు పలికారు. కరోనా వ్యాప్తి కోసం ఎవరైనా కృషి చేస్తారా? తమ నాయకులపై కడుపు మంటతో టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు.
 

Back to Top