చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ‘జనమంతా జగన్ వెంటే ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మరోసారి చిత్తూరు జిల్లాలో నిరూపితమైంది. సీఎం వైయస్ జగన్‌కు దామలచెరువులో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం పలికారు. ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర కనిపించింది.కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ వెళ్లారు. కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చారు. బస్సు యాత్రలో ప్రజల సమస్యలు వినేందుకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. జనంలో ఒకడిగా...జనం సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తుల సమస్యలు ఓపికగా విన్న సీఎం వైయస్ జగన్.. రెండు నెలల్లో మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా మేలు చేస్తానన్నారు. దీంతో రైతులు ఈలలు, కేకలు వేసి ‘జై జగన్..సీఎం..సీఎం’ అంటూ నినదించారు. పెద్దన్నలా తమ కుటుంబాలను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కాపాడుతోందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు చెప్పారు.