సీఎం వైయస్ జగన్‌ను ప్రశంసించిన కేంద్రమంత్రి

 విజయవాడ/విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసించారు. విశాఖలోని 1000 పడకల కోవిడ్‌ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం వైయ‌స్‌ జగన్‌ లక్ష్యమున్న లక్షణమైన నాయకులని పేర్కొన్నారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్న ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

వైద్య సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని.. మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా ఏపీ నిలుస్తోందని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. కరోనా కట్టకికి నిరంతరం పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం. మెగా మెడికల్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న సీఎం జగన్‌కు అభినందనలు. రాష్ట్రంలో కోవిడ్‌ ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లే అన్ని రంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని.. ముందుకు వెళ్తున్న ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని’’ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసించారు.

తాజా వీడియోలు

Back to Top