చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీ కాళహస్తీ లో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తరఫున వైయస్ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్‌లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి చెప్పారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..సామాన్యులను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. మాధవి, నందిగం సురేష్‌లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్‌కు వెళ్తారని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు.