మజ్జి నర్సింగరావు కు మంత్రి బొత్స నివాళి

విజ‌య‌న‌గ‌రం: తన మేనమామ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తండ్రి అయిన మజ్జి నర్సింగరావు కు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి బొత్స ఝాన్సీ లక్ష్మి  చిన్న శ్రీను ఇంటికి వెళ్ళి, నర్సింగరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సింగరావు మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మజ్జి నర్సింగరావుకు కన్నీటి వీడ్కోలు
  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విజయనగరం జిల్లా అధ్య‌క్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తండ్రి మజ్జి నరసింహారావు  గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అతని పార్థీవ దేహాన్ని
ప్రజల సందర్శనార్థం ప్రదీప్ నగర్ చిన్న శ్రీను స్వగృహం వద్ద ఉంచారు. వారి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి, చిన్న శ్రీనును పరామర్శించారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు తోటపాలెం రోటరీ స్వర్గధామంలో అంతిక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో.. పార్లమెంట్ సభ్యులు  బెల్లాన చంద్రశేఖర్, మాజీ పార్లమెంట్ సభ్యులుబొత్స ఝాన్సీ లక్ష్మీ, ప్రభుత్వ విప్ మరియు చోడవరం శాసనసభ్యులుకరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, శాసన సభ్యులు శంబంగి వెంకట చినప్పల నాయుడు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాస రావు, అలజంగి జోగారావు, కంబాల జోగులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘు రాజు, పాలవలస విక్రాంత్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్విని, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేట ప్రసాద్, జిసిసి చైర్‌ప‌ర్స‌న్ శోభ స్వాతిరాణి , రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు , డిసిసిబి చైర్మన్ వేచలపు వెంకట చిన్న రామ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవనాపు భావన గారు, ఎస్ కోట మాజీ శాసనసభ్యులు శోభ హైమావతి ,   ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. 

తాజా వీడియోలు

Back to Top