రేపు పోల‌వ‌రానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

క్షేత్రస్థాయిలో ప్రత్య‌క్షంగా ప్రాజెక్ట్ పనుల పరిశీలన

 మూడో పర్యాయం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం పర్యటన

 అధికారులకు , ఇంజనీర్లు కు దిశా నిర్దేశం

 ప‌శ్చిమ గోదావ‌రి:  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఈ నెల 19వ తేదీ(రేపు)  పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌నున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్య‌క్షంగా ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు, ఇంజ‌నీర్ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు ముంపు గ్రామాల ప్రజల పునరావాసానికి, ప్యాకేజీ అమలుకు నిజాయితీతో కూడి అడుగులు వేస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి , జలవనరుల శాఖ  మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ అధికారుల సహకారం, పర్యవేక్షణతో పనులు ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి. 

ఒకవైపు భారీ వరదలు , మరోవైపు కలవరపెడుతున్న కరోనా కు వేరవకుండా ముఖ్యమంత్రి దిశానిర్దేశం లో  పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో ఊపందుకున్నాయి. పక్కా ప్రణాళికకు తోడు ప్రభుత్వం, అధికారుల సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్నాయి.

పటిష్టమైన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్న గత రెండేళ్లుగా చేపట్టిన పనులే ప్రత్యేక్ష సాక్ష్యం. 

వేగానికి నిఖార్సైన రుజువులివిగో....
పోలవరం పనులు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండు సంవత్సరాలు గా మేఘా సంస్థ ద్వారా పనులలో వేగం పుంజుకుంది. అందుకు కొన్ని గణాంకాలు రుజువుగా ఉన్నాయి. 

 రెండేళ్ల‌లో పోల‌వ‌రం ప‌రుగులుపెట్టిందిలా....

అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టు పై నిరంతరం సమీక్షలు జరిపి, నాణ్యమైన పనులతో పాటు వృదాఖర్చు తగించేలా ప్రణాళికలు అమలు చేశారు. 
* 2019 న‌వంబ‌ర్ 8న మేఘా సంస్థ చేతికి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు 

*21-11-2019లో ప్రాజెక్టు స్పిల్ వే ''O'' బ్లాకు వ‌ద్ద కాంక్రీట్ ప‌నులు 

* ఫిబ్రవరి-17-2020 న గడ్డ‌ర్ల నిర్మాణ పనులు 

* 2020 జూలై-6 స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక మొద‌లు 

* 2020 ఆగష్ట్‌-19న వ‌ర‌దలోనూ స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు  

* 2020 సెప్టెంబర్ 09న స్పిల్ వే బ్రిడ్జి శ్లాబ్ కాంక్రీట్ ప‌నులు ప్రారంభం

* 2020నవంబర్-12నాటికి 2లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి 

* 2020 డిసెంబర్-17న స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక పనులు

* 2021 ఫిబ్రవరి-11న‌ నాటికి స్పిల్‌వే లోని 52 పిల్లర్లు 52మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి 

* 2021 ఫిబ్రవరి-20న స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమర్చడం పూర్తి 

* 2021ఫిబ్రవరి-22న స్పిల్ వే రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక‌ పనులు 

* 2021ఫిబ్రవరి-26న స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి 

* 2021మార్చి-25న స్పిల్ వే రేడియల్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం.

* 2021మే-27న ఎగువ కాఫర్ డ్యాం అన్ని గ్యాప్‌ల‌ను పూడ్చి నదికి అడ్డుకట్ట 

* 2021జూన్ 11న అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే వైపు గోదావరి మ‌ళ్లింపు 

* 2021జూన్-23న రేడియల్ గేట్లు అమర్చిన తరువాత స్పిల్ వే నుండి గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ప్రతి అడుగులోను రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు సాగు లోకి తీసుకుని వొచ్చి, త్రాగునీరు, జల విద్యుత్తు ఉత్పాదన సాకారం కోసెం కృషి చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top