నేడు సీఎం వైయ‌స్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన‌

తాడేపల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) ను ఏపీ గవర్నర్‌ జస్టిస్‌  అబ్దుల్‌ నజీర్, సీఎం వైయ‌స్‌ జగన్ సందర్శించనున్నారు. 

మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకుంటారు. ప్రధాని  నరేంద్రమోదీకి గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికి నాసిన్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) ను సందర్శించనున్నారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.
 

Back to Top