శ్రీకాకుళం: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావుల రుణం తీర్చుకుంటామని మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకులు మన్మధరావు పేర్కొన్నారు. పది వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం వైయస్ జగన్, మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రపటాలకు శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులు శ్రీకాకుళం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ.. అనేక యూనియన్లలో పని చేశాను, చేస్తూ ఉన్నాను. గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. భగవంతుడు ప్రసాదించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మాకు న్యాయం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సుమారు రాష్ట్రంలో 10,117 మంది కుటుంబాలకు వెలుగులు ఇస్తున్నాంరంటే 50 వేల మందికి అన్నదానం చేస్తున్నట్లే. ఆ కుటుంబాలకు భద్రత ఇస్తున్నట్లు లెక్క. అటువంటి ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. అవసరం వచ్చినప్పుడు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు మా శిబిరాన్ని ధర్మాన అనేకసార్లు మా శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతుగా నిలిచారు.ఇలాంటి వ్యక్తులు సీఎం వైయస్ జగన్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ముందుకు వచ్చారు. మా కుటుంబాలన్ని వైయస్ జగన్‌కు, మంత్రి ధర్మానకు అండగా, మద్దతుగా ఉండి రుణం తీర్చుకుంటామని మన్మధరావు తెలిపారు.