తూర్పుగోదావరి:ఎగ్జిట్‌పోల్స్ టీడీపీకి రాజకీయాల నుంచి ఎగ్జిట్ అని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఎద్దేవా చేశారు. 2024 నాటికల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు జాతీయ నేతలను డిస్ట్రబ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ..తెలుగువారి గౌరవాన్ని దేశస్థాయిలో పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు.వైయస్‌ఆర్ కాంగ్రెస్‌కు 150 అసెంబ్లీ,25 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే 30–40 ఏళ్లు పాలిస్తారని చంద్రబాబులో వణుకు పుట్టి రకరకాలుగా వేషాలు వేస్తున్నారన్నారు.ప్రజాతీర్పును చంద్రబాబు హుందాగా గౌరవించాలని తెలిపారు.