త్వరలోనే టీడీపీ ఖాళీ

టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి బాక్సర్‌ రాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

విశాఖ: చాలా మంది టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఖాళీ అవుతుందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరంలోని 14వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి భాస్కర్‌ రాజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో బాక్సర్‌ రాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top