పయ్యావుల కేశవ్ జిమ్మిక్కు రాజకీయాలు మానుకో

 విజయ సంకల్ప యాత్రలో  వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి 

ఉరవకొండ:  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన జిమ్మిక్కు రాజకీయాలు మానుకోవాలని ఆయన రాజకీయ జీవితంలో ఉరవకొండ ప్రజలను నిలువెల్లా మోసం చేసిన ఘనత కేశవ్ దని వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి విమర్శించారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయన తనయుడు,  వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి 'విజయ సంకల్పయాత్ర'ను చేపట్టారు. ముందుగా ఉరవకొండ పట్టణం మీదుగా వందలాది మంది తో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బూదగవి మారెమ్మ అవ్వ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చీకులగురికి వరకు బైక్ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా చీకులగురికి గ్రామస్తులు ప్రణయ్ రెడ్డి కి ఘాన స్వాగతం పలికారు. గజ మాలలతో సత్కరించారు.ప్రజలకు అభివాదం చెబుతూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై యువనేత ప్రణయ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న నమ్మకం, ప్రజాదరణ చూసి టీడీపీకి ఇప్పుడు భయం పట్టుకుందని అన్నారు. అందుకే బాదుడే బాదుడు లో కేశవ్ నిరాధారమైన వ్యాఖ్యలు,ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన 28 ఏళ్ల రాజకీయ జీవితంలో నియోజకవర్గ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ఘనత కేశవ్ కే దక్కిందన్నారు. ఉరవకొండ అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రణయ్ రెడ్డి తెలిపారు.దమ్ముంటే ఈ చర్చకు నువ్వే రావాలని నీ ఇంట్లో నైనా సరే లేక ఉరవకొండ టవర్ క్లాక్ వద్దనైన ఒకే నని ఎమ్మెల్యే కేశవ్ కు ప్రణయ్ సవాలు విసిరారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం  అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉరవకొండ అభివృద్ధికి అత్యధిక నిధులు తెచ్చిన ఘనత విశ్వేశ్వరరెడ్డి దే అన్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఒక పార్ట్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని యువనేత విమర్శించారు. మైనార్టీలకు, పేదలకు మంచి చేస్తానని చెప్పి దొంగ జీఓలు తెచ్చిన చరిత్ర పయ్యావుల కేశవ్ కు దక్కిందన్నారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ కాలనీ కి తన తండ్రి పేరు కూడా పెట్టుకున్నారని.. అయితే ఎవరికి ఎక్కడ పట్టాలు ఇచ్చారో చెప్పకుండా ఆపట్టాలో పదుల సంఖ్యలో సర్వే నంబర్లు వేసి మహిళలను మోసం చేసాడన్నారు. విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే మీకు పట్టాలు తీసేస్తారంటూ ప్రచారం చేసి 2019లో గెలిచారని విమర్శించారు. ఇలా అనేక రకాలు మోసం చేసిన కేశవ్ గురించి ఉరవకొండ ప్రజలకు తెలుసున్నారు. ఆయన గెలిచిన మూడేన్నరేళ్ల నుంచి ఏమయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడేదో ప్రజలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారన్నారు. అలాగే ఆయన పార్ట్ టైం ఎమ్మెల్యేగానే ఉంటారన్నారు. ఆయన ఇన్ని రోజులు ఉరవకొండ ఎంత ఖర్చు చేశారో  చర్చించేందుకు ఎక్కడైనా సిద్ధమన్నారు.

తాజా వీడియోలు

Back to Top