ఘ‌నంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

  విజ‌య‌వాడ‌:  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌లోని హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వ‌ర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన‌ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  ,సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
రాణిగారితోట నేతాజీ బ్రిడ్జి దగ్గర శ్రీ కృష్ణ దేవాలయ సేవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు బొప్పన భవకుమార్ పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.  

Back to Top