పవన్... ఆనాడు నీ పౌరుషం ఏమైందీ..? 

శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

తిరుప‌తి:  కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను టీడీపీ ప్ర‌భుత్వం ఇబ్బందులు పెడితే ఆనాడు నీ పౌరుషం ఏమైంద‌ని శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ముద్రగడను పరామర్శించడానికి చిరంజీవి వస్తే..చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి పంపింద‌ని గుర్తు చేశారు. ఇటీవ‌ల ప్రెస్‌మీట్‌లో పవన్ బూతులు విని చిరంజీవి చాలా బాధ పడి ఉంటార‌ని తెలిపారు.  ఎన్టీఆర్‌ చనిపోవడానికి కారణం చంద్రబాబు కాదా..? అని ప్ర‌శ్నించారు.  5 కోట్ల ఆంధ్రల కోసం..
సీఎం వైయ‌స్ జగన్ మూడు రాజధానులు అంటుంటే.. తన ఆస్తులు , తన బినామీల ఆస్తులు ..కాపాడుకోవడానికి చంద్రబాబు అమరావతి అంటున్నాడు.  పవన్ కల్యాణ్‌ గురించి రాష్ట్ర మహిళలు ఆలోచించాల‌న్నారు. మూడు పెళ్లిళ్లు అంటాడు...
మహిళలంటే చులకన మాట్లాడుతాడు..డైవర్స్ ఇచ్చి మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి అంటాడు..ఇలాంటి వ్య‌క్తి నిజంగా నాయ‌కుడేనా?. 2024 తరువాత పవన్ కల్యాణ్‌ను ...రాష్ట్రంలో కనపడకుండా చేయాల్సిన బాధ్యత మహిళలదే అన్నారు.

తాజా వీడియోలు

Back to Top