శ్రీ‌శైలంలో టీడీపీకి షాక్‌

30 మ‌త్స్య‌కార కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శిల్పాకు ఘ‌న స్వాగ‌తం

నంద్యాల‌:  శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న 30 మ‌త్స్య‌కార కుటుంబాలు ఆ పార్టీ నేత‌ల తీరు న‌చ్చ‌క గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో మ‌త్స్య‌కార కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చ‌కున్నాయి. వారికి చ‌క్ర‌పాణిరెడ్డి కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై శ్రీశైలం మండలం వాల్మీకి సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, శ్రీను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు మ‌త్స్య‌కారులు ప్ర‌క‌టించారు. 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు ఘ‌న స్వాగ‌తం
ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి శ్రీ‌శైలం మండ‌లంలో రెండు రోజులుగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఏ వీధికి వెళ్లినా ఎమ్మెల్యేకు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పూల‌వ‌ర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రి కావాల‌ని నిన‌దిస్తున్నారు. ప్ర‌తి ఇంటికి వెళ్లిన చ‌క్ర‌పాణిరెడ్డి ఈ నాలుగేళ్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించి వారి మ‌ద్ద‌తు కోరారు.   శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి భారీ ఎత్తున గజమాలతో స్వాగతం పలికారు.  

 

ఆర్థిక‌సాయం
  శ్రీశైలం మండ‌లం లింగాల గట్టులో  ఇటీవల అగ్ని ప్రమాదంలో జ‌రిగి మత్స్యకారుల వలలు కాలిపోయాయి. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామానికి వ‌చ్చిన ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఈ విష‌యంపై స్పందించారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఒక్కొక్కరికి  10,000 రూపాయలు చొప్పున మొత్తం 20 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

ప‌రామ‌ర్శ‌
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన  శ్రీశైలం దేవస్థానం ఆలయ అర్చకులు శివ నాగ ప్రసాదు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌రామ‌ర్శించారు. శివ‌నాగ‌ప్ర‌సాద్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి దైర్యం చెప్పారు.  
శ్రీశైలంలో ఇటీవల అనుమానస్పదంగా మరణించిన సంతోష్ నాయక్ కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో  శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప‌రామ‌ర్శించారు. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పి ఓదార్చారు.

Back to Top