వైయ‌స్ఆర్‌సీపీలోకి శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన శాంతిరాముడు

తాడేప‌ల్లి:  నంద్యాల శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత డాక్ట‌ర్‌ ఎం. శాంతిరాముడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో  నంద్యాల శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత డాక్ట‌ర్‌. ఎం. శాంతిరాముడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాంతిరాముడుతో పాటు ఆయన తనయుడు శివరామ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కండువాలు క‌ప్పి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top