మార్కాపురం: మార్కాపురం జన సంద్రమైంది. సామాజిక సాధికార యాత్రకు ఘన స్వాగతం పలికింది. అశేష జనవాహినితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వైయస్సార్ విగ్రహం వద్ద జరిగిన సభ విజయవంతమైంది. వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురంలో వెనుకబడిన వర్గాల ప్రజలూ ఎక్కువ. ఈ ప్రాంతానికి జగనన్న ఎంతో మేలు చేశారు. ఆ ఫలాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. డిసెంబర్‌లో పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో వెలుగులు నిండుతాయన్నారు మార్కాపురం ఎమ్మెల్యే, కార్యక్రమ నిర్వాహక బాధ్యతల్ని తీసుకున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి. సభ మొత్తం సామాజిక సాధికారత ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు పార్థసారథి, హఫీజ్ ఖాన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ – రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మూడున్నర కోట్లకు పైగా ఉన్నారు. ఈరోజు వారి గురించి ఆలోచించి, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వారికి అన్ని రకాల హక్కుల కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – వెనకకు నెట్టివేయబడ్డ మన కులాలవారిని ముందుకు తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. – ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత వరకు మేలు పొందామో ఆలోచించాలి. అలా చేస్తే..పేద బడుగుబలహీన వర్గాలంటే ప్రేమించే జగనన్న మనకిచ్చిన సంక్షేమపథకాల లబ్ది ఎంతో అర్థమవుతుంది. – వెలిగొండ ప్రాజెక్టు డిసెంబర్‌లోగా పూర్తి చేసి, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా సంకల్పించారు ముఖ్యమంత్రి జగన్. – ఈ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎక్కువ. జగనన్న పాలనలో ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుండటం ఎంతో సంతోషించాల్సిన విషయం. – అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆదర్శాలను పాటిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. – కేబినెట్‌లో, నామినేటెడ్ పోస్టుల్లో దళితులు, బీసీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్‌మోహన్‌రెడ్డి. – కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఎక్కడ...ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ, పేద, బడుగు, బలహీనువర్గాలను ఎంతో బలోపేతం చేసిన, చేస్తున్న జగనన్న ఎక్కడ? ఇద్దరికీ అసలు పోలికే లేదు. – మార్కాపురంలో జగనన్న చేసిన అభివృద్ది ఫలాలను మనమందరం అనుభవిస్తున్నాం. వెనుకబడిన ఈ ప్రాంతంలో వెలుగులు కనిపిస్తున్నాయంటే జగనన్న పాలనవల్లనే. మంత్రి మేరుగ నాగార్జున – ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం లక్షల కోట్ల రూపాయలను పథకాల రూపంలో నేరుగా అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. – ఇంగ్లీషు మీడియం చదువులు పేదవర్గాల పిల్లలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్నింటా అగ్రస్థానం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో అబద్ధాలు చెప్పారు. గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు చంద్రబాబు. – 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు జగనన్న. – ఈ రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన చరిత్ర జగనన్నది. – మనకు సాయం చేసే, అండగా వుండే నాయకుడు జగనన్న రూపంలో దొరికారు. కొలుసు పార్థసార ధి, ఎమ్మెల్యే – ఏమిటీ సామాజిక సాధికార యాత్ర? మన పార్టీ ఎందుకు చేస్తోంది? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. – మనకు స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు దాటినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఆలోచించినవారుగానీ, వారికి రాజ్యాంగంలోని హక్కులు అందించినవారుగానీ ఎవరూ లేరు. – మన పిల్లలను పెద్ద చదువులు చదివించుకునే అవకాశం నిన్నామొన్నటి వరకు లేదు. మనకు రాజ్యాధికారం, అధికారం పదవులు ఎప్పుడూ లేవు. – మైనార్టీ సోదరుల పరిస్థితీ మనలాంటిదే. ఆయా వెనుకబడిన వర్గాలకు ఏంచెయ్యాలని ఆలోచించే నాయకులు చరిత్రలో పెద్దగా లేరు. మన కళ్లముందు కనిపించేది ఇద్దరే నాయకులు. ఒకరు వైయస్సార్. ఇంకొకరు ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి. – సీఎం జగనన్న అన్ని కులాలు, వర్గాలను ఒకేలా చూస్తున్నారు. ఎక్కడా వివక్షకు చోటివ్వడం లేదు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో, సంక్షేమ కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – ప్రతిభావంతుడైన పేదవిద్యార్థుల పెద్ద చదువులకు వైయస్సార్ ఎలాంటి రాజమార్గం వేశారో అందరికీ తెలిసిన విషయమే. – ఈ రోజు మనవారి ప్రతి ఇంటిలో పెద్దచదువులు చదివిన పిల్లలు ఉన్నారంటే అది నాడు వైయస్సార్, నేడు జగనన్నల వల్లనే. – 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన ఘనత జగనన్నదే. అన్నివర్గాల ప్రజలను ఒక చోటికి చేర్చి, ఊళ్లకు ఊళ్లు ఏర్పాటు చేస్తున్నారు. – గతంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో గానీ లేని విధంగా పేదల గురించి ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. అందరికీ సమానావకాశాలు అందించడమే సామాజిక న్యాయం. హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్యే – మేము రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి చూసింది పెద్దనాయకులే సభల్లో మాట్లాడేవారు. కానీ జగనన్న పరిస్థితి మార్చారు. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైనా, పేదలైనా సభల్లో మాట్లాడటం కనిపిస్తోంది. ఆ స్థాయి, సాధికారత కల్పించింది జగనన్నే. – భారతదేశ చరిత్రలోనే జగనన్నలాంటి నాయకుడిని ఎవరూ చూడలేదు. ఆయన మన పిల్లల గురించి, వాళ్ల చదువుల గురించి ఆలోచిస్తాడు. – పేదలైనవారు పెద్ద చదువులు చదవాలని, వారి కుటుంబాల తలరాతలు మారాలని తపించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. – మన రాష్ట్రంలోనే కాదు, పక్కరాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చేస్తున్న ఘనత జగనన్నది. – శాసనసభ మొదలు పార్లమెంటు దాకా, శాసనమండలి మొదలు రాజ్యసభ వరకు, 56 కార్పొరేషన్లలో ఛైర్మన్ల వరకు ఈరోజు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారంటే జగనన్న వల్లనే.