అధికారం కోసం దింపుడు కళ్ళెం ఆశతో చంద్రబాబు అండ్ కో ఎంతకైనా తెగిస్తారు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

ఎన్నికల కమీషన్ వద్ద తప్పుడు ఫిర్యాదులు పదే పదే చేస్తుంటారు.

ఇప్పటికే ఓటర్ల జాబితా విషయంలో టిడిపి అదే పనిచేసింది.వాటిని సరైన రీతిలో ఎదుర్కొన్నాం

ఇకపై కూడా  పార్టీ లీగల్ సెల్ అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి.

 ఎన్నికల సమయంలో లీగల్ సెల్ కీలకంగా వ్యవహరించాలి.

వైయస్ఆర్‌సీపీ విజయం ఖాయం అయింది.దీనిని ఎవరూ ఆపలేరు.

చంద్రబాబుకు చెప్పుకోడానికి ఒక్క పధకం లేదు.జగన్ గారు రాష్ర్టంలోని 87 శాతం మందికి లబ్ది కలిగించారు.

ప్రజలకు ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా అందుబాటులో వచ్చేలా జగన్ వ్యవస్ధను నెలకొల్పారు

అధికారం కోసం లెఫ్ట్,రైట్,కాంగ్రెస్,బిజేపి వీలుంటే నక్సలైట్లను సైతం కలుపుకు వెళ్లేలా చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.

పార్టీ లీగల్ సెల్ సమావేశంలో  సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి:  అధికారం కోసం దింపుడు కళ్ళెం ఆశతో చంద్రబాబు అండ్ కో ఎంతకైనా తెగిస్తారు....ఎన్నికల కమీషన్ కు తప్పుడు ఫిర్యాదులతో తప్పుదోవ పట్టిస్తుంటారు వాటన్నింటిని పార్టీ లీగల్ సెల్ సమర్దవంతంగా ఎదుర్కోవాలని పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రానున్న 50...60 రోజులు చాలా కీలకమైనవని ఇక్కడ లీగల్ సెల్ అప్రమత్తంగా ఉండాలని కోరారు.  తాడేపల్లిలోని పాతూరు రోడ్డులో శనివారం జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశానికి లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ అభ్యర్దులకు నామినేషన్లు,ఇతర డాక్యుమెంట్స్ వాటిపై అవగాహన కల్పించడం,లీగల్ గా పార్టీ నేతలకు,కార్యకర్తలకు అవసరమైన చోట్ల న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలను బాధ్యతాయుతంగా అందించాలని సజ్జల కోరారు.చంద్రబాబు లాంటి వ్యక్తులు అరాచకాలు సృష్టించడం,విషప్రచారం,మాయోపాయాలు వంటి వాటితో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటారని అన్నారు.2014,గత ఎన్నికల సమయంలో కూడా అవన్నీ మనకు అనుభవమే అని కాని వారిపట్ల నిరంతరం అప్రమత్తత అవసరం అన్నారు. 

          ఇటీవల కొంతకాలంగా చూస్తే దొంగఓట్లు చేర్పించింది టిడిపి వాళ్లు. అవి తీయించడానికి మన ఇబ్బందులు పడ్డాం.కాని వారికున్న పచ్చమీడియా సహకారంతో  తిరిగి మనపైనే ఆ నిందలు వేశారు. ఎందుకంటే వ్యవస్ధలను మేనేజ్ చేయడం టిడిపిలా మనకు చేతకాదు.శ్రీ వైయస్ జగన్ గారు ఎంతసేపటికి నిరంతరం ప్రజలలో  ఉండటం.... వారికి వీలైనంత మంచి చేయడం ఆ తర్వాత వారి ఆశీస్సులు పొందడం ఇది ఆయన మహోన్నత లక్ష్యం.

         టిడిపి అలా కాదు ఏమి చేసైనా అధికారంలోకి రావాలి.  డెస్పరేట్ మూడ్ లో టిడిపి వాళ్లు దేనికైనా తెగిస్తారు.ఈసి దగ్గరకు వెెల్లి కంప్లైంట్ చేస్తుంటారు.ఇంకా మండల,పట్టణ,జిల్లా స్దాయిలో సైతం ఫిర్యాదులు చేస్తుంటారు.వారే అన్నిరకాల  అరాచకాలు చేసి మనపైన బురద వేస్తుంటారు.వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ లో టిడిపి...చంద్రబాబు అండ్ కో చేసే కుట్రలు ముందే పసిగట్టాలి. వారి కుట్రలను భగ్నం చేయాలి ఇందులో మీదే కీ రోల్ ప్రత్యర్దులు ఏమేం చేయడానికి అవకాశం ఉందో నిరంతరం వాటిని గమనించి అలెర్ట్ గా ఉండాలి అన్నారు.ఈ విషయంలో పార్టీ యావత్తు మీమీద అంటే లీగల్ సెల్ పై డిపెండ్ అయి ఉందనే విషయం గుర్తించాలన్నారు.ఆ కీలకమైన బాధ్యత మీపై ఉందనేది గుర్తెరిగి ప్రవర్తించాలని తెలియచేశారు.

        వైయస్ జగన్ చేపట్టిన పధకాలు,సంక్షేమం,అభివృధ్ది ఇలా అన్నింటిలోను ప్రజల ఆదరణ పొందింది.ప్రజలకు ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా అందుబాటులో వచ్చేలా జగన్ వ్యవస్ధను నెలకొల్పారు ప్రజలు కూడా జగన్ గారికి కృతజ్ఞతలు తెలియచేయడానికి ప్రతి ఓటర్ లోక్ సభకు,శాసనసభకు రెండు బటన్లు ఫ్యాన్ పై నొక్కేందుకు సిధ్దంగా ఉన్నారు. తిరిగి వైయస్సార్ సిపినే అధికారంలోకి రాబోతోంది. వైయస్సార్ సిపి విజయం ఖాయం అయింది.దీనిని ఎవరూ ఆపలేరు.అయినా అప్రమత్తత అవసరం అన్నారు.

      చంద్రబాబు అధికారం కోసం లెఫ్ట్,రైట్,కాంగ్రెస్,బిజేపి వీలుంటే నక్సలైట్లను సైతం కలుపుకు వెళ్లేలా చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.డెస్పరేట్ మూడు లో అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.రాష్ర్టంలో 87 శాతం మందికి జగన్ గారికి ప్రవేశపెట్టిన పధకాల వల్ల లబ్ది కలిగిందన్నారు.ఇదే సమయంలో చూస్తే చంద్రబాబుకు తన  14 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క పధకం కూడా లేదన్నారు.జగన్ గారు సచివాలయ,వాలంటీర్లు వ్యవస్ద ద్వారా ప్రజలకు పరిపాలనను డోర్ స్టెప్ వద్దకు అవినీతికి తావులేని పాలన పారదర్శకమైన పాలన తెచ్చారన్నారు.ఏ పధకం కావాలన్ని మద్యవర్తి అవసరం లేని పాలన తీసుకువచ్చారన్నారు.చంద్రబాబు పాలన అంతా దోపిడీ మయం అందుకే తన పాలనలో ప్రజలను దోచుకున్న జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తాననే విధంగా చెప్పుకోలేని పరిస్దితి ఉందన్నారు.చంద్రబాబు జగన్ గారి పాలనను పధకాలను విమర్శించలేక విషప్రచారం చేస్తూ పొత్తులతో  అధికారంలోకి రావాలనే కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు.జగన్ గారు మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేసేలా విశ్వసనీయతతో వ్యవరిస్తారని అధికారం అంటే బాధ్యత అనేది ఆయన ఆలోచన అన్నారు. బాధలలో ప్రజలకు అండగా ఉంటే ఏమి జరుగుతుందో కుప్పం ప్రజలు చేసి చూపించారన్నారు. చంద్రబాబు ప్రాతినిద్యం వహించే కుప్పంలో సైతం స్దానిక సంస్దలలో వైయస్సార్ సిపి విజయం సాధించడం రాష్ర్ట వ్యాప్తంగా 175 స్దానాలలో విజయానికి నాంది పలికిందన్నారు. వైనాట్ 175 అనే స్లోగన్ సరదాగా ఇచ్చింది కాదన్నారు.కుప్పంలో పార్టీ విజయమే ఇందుకు నిదర్శనం అన్నారు.గతంలోలా రాజకీయాలు లేవని ఇప్పుడు రాజకీయాలు మారాయన్నారు.మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ను గేరప్ చేసేవిధంగా పరిపాలన సాగాలన్నారు.రాష్ర్టం విభజించ బడ్డాక రాష్ర్టాన్ని అభివృధ్దిపధంలోకి తీసుకువెళ్లాలంటే ఏమి చేయాలో అవన్నీ జగన్ గారి పాలనలో చేసిచూపించారన్నారు.

సమావేశంలోపార్టీ శాసనమండలి సభ్యులు,పార్టీ విప్  లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Back to Top