మైనారిటీలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అండ

 బిజేపి, టిడిపి లాంటి పార్టీలు మతవిద్వేషాలను రెచ్చగొట్టినా మైనారిటీల రక్షణ భాధ్యత మాదే.

 మైనారిటీలను విద్య, ఉద్యోగాలపరంగా రిజర్వేషన్లు కల్పించింది వైయస్ రాజశేఖరరెడ్డి.

 మైనారిటీలకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నతస్ధానాలకు తీసుకువచ్చేందుకు శ్రీ వైయస్ జగన్ ప్రణాళికాబధ్దంగా కృషి చేస్తున్నారు.

షేక్ కులస్ధుల ఆత్మీయ సమావేశంలో  సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి: దేశంలో మైనారిటీలు గుండెమీద చేయివేసుకుని పూర్తి భరోసాగా, భధ్రంగా ఉండగలిగే రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో షేక్ కులస్ధుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి షేక్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఆశా బేగం అధ్యక్షత వహించారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మైనారిటీలు విద్య, ఉద్యోగావకాశాలలో వెనకబడి ఉండటాన్ని గమనించి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆనాటి నుంచి మైనారిటీలలో విద్యావంతుల సంఖ్య పెరిగిందన్నారు. ఉద్యోగాలు సైతం సాధించి వారి కుటుంబాలు అభివృధ్ది సాధించాయన్నారు. నేడు శ్రీ వైయస్ జగన్ మొదటినుంచి మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు. ముఖ్యంగా మైనారిటీలు అత్యధికంగా పేదవర్గాలుగా ఉండటం గమనించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వారి సంక్షేమానికి అనేక పథ‌కాలను శ్రీ వైయస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ పథ‌కాలను ఆయా కుటుంబాలదరికి చేర్చాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని మైనారిటీ నేతలు, షేక్ కార్పోరేషన్ ఛైర్మన్, డైరక్టర్లపై ఉందన్నారు. ప్రతి పథ‌కం వారికి చేరిందా.... చేరకపోతే వారితో దరఖాస్తు చేయించి ఆ పథ‌కాలు వారికి అందేలా చేయాలన్నారు. ఆ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు, అధికారులతో మాట్లాడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల కాలంలో పేదవర్గాలకు పింఛన్లు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి ఇస్తే ఆ తర్వాత ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ఓట్ల కోసం మరికొంతమందికి పింఛన్ల‌ను మంజూరు చేసిందన్నారు. నేడు శ్రీ వైయస్ జగన్ శాచ్యురేషన్ పధ్దతిలో దాదాపు 60 లక్షలమందికి అందచేస్తున్నారని తెలిపారు. అయితే అర్హులైన ప్రతిఒక్కరికి పింఛన్ అందాలనేది ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ లక్ష్యమని అన్నారు. అదేరీతిలో అనర్హులెవరైనా ఉంటే వారి స్ధానంలో కూడా అర్హులకు అందించాలనే ఉధ్దేశ్యంతో కొన్ని నియమనిబంధనలను పరిశీలిస్తుంటే దానికి సైతం పచ్చమీడియా, టిడిపితో కుమ్మక్కై నానాయాగి చేస్తోందని తెలిపారు. ప్రజల ఆస్ధికి కస్టోడియన్లుగా ఆస్దిని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిపై ఉంటుందనే విషయం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంతోపాటు అర్హులైన వారికి పథ‌కాలను అందచేసేవిధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపుఇచ్చారు.

డిప్యూటి సిఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.... వైయస్ రాజశేఖరరెడ్డి విద్య, ఉద్యోగ అంశాలలో మైనారిటీలకు కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా మైనారిటీల కుటుంబాలలో విశేష అభివృధ్ది జరిగిందన్నారు. ప్రతి మైనారిటీ కూడా వైయస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. నేడు వైయస్ జగన్ గారి వల్లనే మైనారిటీ డిప్యూటి సిఎం కాగలిగారని దానికి ఉదాహరణ తానేనని అన్నారు.

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ముస్లిం పక్షపాతి అని తెలిపారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగులు, బలహీన వర్గాలు, ప్రత్యేకించి ముస్లిం మైనారిటీల పార్టీ అన్నారు. ముస్లింలలో ఒక బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసేందుకే ప్రత్యేకంగా షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం సహకారాన్ని అందిపుచ్చుకుని షేక్‌లు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలని అప్పిరెడ్డి అభిలషించారు.

ఈ సమావేశంలో రాష్ర్ట బిసి సంక్షేమ శాఖమంత్రి శ్రీ సిహెచ్ వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, ఏపీ ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్ షమీమ్ అస్లాం, ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్, హజ్ కమిటీ ఛైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కరీముల్లా షేక్ ఆమీన్, నవరత్నాల నారాయణమూర్తి, రాయలసీమ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు తొండమల్ల పుల్లయ్య, షేక్  కార్పొరేషన్ డైరక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to Top