ఆ 24 కూడా బాబే డిసైడ్ చేస్తాడేమో..!

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

24 సీట్లతో పవన్‌ కల్యాణ్‌ ఎవరి మీద యుద్ధం చేస్తాడు..?

ఈమాత్రానికి పార్టీ ఎందుకు..? టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే పోలా..!

తానెక్కడ పోటీచేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్‌

ఎత్తిపోయిన టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతా..?: స‌జ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్‌ చేస్తారా? అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్‌ దిగజారిపోయారని సజ్జల కామెంట్స్‌ చేశారు.  టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల స్పందించారు. శ‌నివారం సజ్జల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.   

 సజ్జల రామకృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే.. 

ఆ 24 కూడా బాబే ఇస్తాడేమో..!:
– పవన్‌ కల్యాణ్‌.. వందకు 100 శాతం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. 
– వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా 87 శాతం జగన్‌ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. 
– రాష్ట్రంలో అన్ని సీట్లు గెలుచుకుంటూ..కుప్పంలో కూడా విజయం వైపు మేం అడుగులు వేస్తున్నాం. 
– ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని, తన సామాజికవర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయడం దారుణం. 
– ఆయనపై జాలి కంటే ఆయన్ను అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతుంది. 
– అసలు ఒక పార్టీలా కూడా వ్యవహరించలేని పరిస్థితి పవన్‌ కళ్యాణ్‌ది. 
– జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా చంద్రబాబే చెప్తున్నారు. 24 సీట్లు ఇస్తామని చెప్పారు.
– ఆ 24 మందిలో కూడా అంతా చంద్రబాబునాయుడు పెట్టే అభ్యర్థులే ఉంటారు. 
– బహుశా బీజేపీకి కూడా ఆ 24లోనే ఇస్తాడేమో కూడా తెలియదు. 
–  చంద్రబాబు ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రంపడటం, మరో వైపు పవన్‌ కల్యాణ్‌ను పూర్తిగా మింగేశాడు. 
– పవన్‌ కల్యాణ్‌ సొంత పార్టీని వదిలేసి టీడీపీ ఉపాధ్యక్షుడో, రాష్ట్ర అధ్యక్షుడో తీసుకుని ఉంటే సరిపోయేది అనిపిస్తోంది. 
– అలా చేస్తే చంద్రబాబును నమ్మి పవన్‌ కల్యాణ్‌ వెనుకున్న ఓట్లు రావేమోనని జనసేనను అలానే పెట్టి ఈ డ్రామా అడుతున్నారు. 

24 సీట్లతో పవన్‌ కల్యాణ్‌ ఎవరి మీద యుద్ధం చేస్తాడు..?:
– 24 మందిని పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ ఎవరి మీద యుద్ధం చేస్తాడు..? 
– ఆ 24 మంది అభ్యర్థులు కూడా ఎవరో తెలియకుండా ఆయన ఎవరిపై యుద్ధం చేస్తాడు? 
– నువ్వు యుద్ధం అనడానికి 175 నియోజకవర్గాల్లో నీ మనుషులు ఎవరైనా ఉన్నారా? 
– ఈ 24 స్థానాలకైనా పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటన చేయగలుగుతున్నాడా? 
– కేవలం పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు పలికిస్తున్న చిలకపలుకులు పలుకుతున్నాడు. 
– రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అని వాళ్ల మీడియా ఆ చిలకపలుకులు రాసుకోడానికి తప్ప దేనికీ పనికిరాదు. 

తానెక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితి పవన్‌ది:
– అసలు పవన్‌ కల్యాణ్‌ తాను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి.
– చంద్రబాబు కుప్పం అయినా తన సీటు తాను ఎనౌన్స్‌ చేసుకున్నాడు. ఇతను అయితే తన సీటు తాను కూడా ప్రకటించుకునే పరిస్థితి లేదు. 
– ఇప్పుడు ప్రకటించిన జనసేన 5 సీట్లు మినహా మిగిలిన సీట్లన్నీ చంద్రబాబే డిసైడ్‌ చేయాలి. 
– ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో జగన్‌ గారిని చూసి నేర్చుకోవచ్చు. 
– ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో జగన్మోహన్‌రెడ్డి గారు చూపిస్తుంటే..ఒక రాజకీయ పార్టీ ఇంత దరిద్రంగా ఉంటుందా.. అనేది చూడాలంటే పవన్‌ కల్యాణ్‌ పార్టీను చూస్తే సరిపోతుంది. 
– వారి పార్టీ నిర్మాణం, నియోజకవర్గాల్లో ఇంఛార్జిలను పెట్టుకునే ప్రయత్నం, కింది స్థాయి కమిటీలు కూడా వేయలేని దుస్థితి. 
– దీనికి కారణం రేపు డిమాండ్‌ పెరిగి చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందనే నిర్మాణం చేసుకోలేదు. 
– కేవలం జనసేన పార్టీ పేరు, గాజు గ్లాసు గుర్తు మాత్రం పెట్టుకుని తిరుగుతున్నాడు. 
– ఇక ఆలోచించుకోవాల్సింది...పవన్‌పై ఆశలు పెట్టుకున్న వారు వారికి వారు ఆలోచించుకుని రియలైజ్‌ కావాలి. 

ఎత్తిపోయిన టీడీపీకి పవన్ మద్దతా..?:
– ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 175కి 175 మంది అభ్యర్థులను ప్రకటించుకోలేని దుస్థితి చంద్రబాబుది. 
– జనసేనకు 24 స్థానాలు ఇవ్వడం, ఆ 24 మంది కూడా ఎవరో చెప్పలేని దుస్థితి వారికి ఉంది. 
– బీజేపీతో కూడా పొత్తుకుదిరితే తన అభ్యర్థులనే పంపిస్తాడామో.?
– మాస్టర్‌ ప్లానింగ్‌ అంతా చంద్రబాబే చేస్తాడు. 
– బీజేపీతో పొత్తు అర్జంటుగా పెట్టుకోవాలనే ఉద్ధేశం, కాంగ్రెస్‌కు ఫైనాన్స్‌ చేయించి పరోక్షంగా వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చాలని చూస్తున్నాడు. 
– జగన్‌ గారికి ఉన్న పాజిటివిటీని కొద్దిగైనా తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. 
– రాష్ట్రానికి ఇది చేయగలను అని కానీ, 2014–19 మధ్య ఇది చేశాను అని చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. 
– అలాంటి ఎత్తిపోయిన కేసుకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ వెళ్లడం ఆయన బలహీనత, దరిద్రం. 

బీజేపీతో పొత్తు కోసం దింపుడు కల్లం ఆశ:
– బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రంపడుతున్నారు. అయిపోయింది అన్నారు. 
– నిన్న చార్టర్‌ ఫ్లైట్‌..ఇదిగో పొత్తు అన్నారు. పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్నాడు అన్నారు..మరి ఏదీ కాలేదు. 
– పొత్తు పెట్టుకుంటారో లేదో అది వారి నిర్ణయం. 
– కానీ పొత్తు పెట్టుకోడానికి వెంపర్లాడుతూ తద్వారా ఓట్లు పొందాలని చూస్తున్నాడు. 
– సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొట్టాలని చూస్తున్నారు. 
– దింపుడుకల్లం ఆశలా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీలో ఉన్న ఈయన ఏజెంట్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. 
– రౌడీలు ఎవరో, ప్రజల సంక్షేమాన్ని అందించేంది ఎవరో ప్రజలకు తెలుసు. 
– జనం గొర్రెల్లా నమ్ముతారు అనుకుని ఏదైనా మాట్లాడతాడు. 
– కానీ ప్రజలు వారి పరిపాలన చూశారు..జగన్‌ గారి పరిపాలన కూడా చూశారు. 
– మాకు వస్తున్న సంకేతాల ప్రకారం ప్రజలు జగన్‌ గారిని గతం కంటే అధిక స్థానాలు ఇచ్చి గెలిపించబోతున్నారు. 
– ఇప్పుడు వారిచ్చిన లిస్టుకే శాంటిటీ లేదు..ఇక సామాజిక న్యాయం గురించి ఆలోచించడం అనవసరం. 
– సామాజిక న్యాయం గురించి జగన్‌ గారు ఒక బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశారు. దాన్ని అందుకోవాలంటే వీరి జన్మలో కాదు. 
– ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకున్నారు కాబట్టే సోషల్‌ ఇంజినీరింగ్‌ చేయగలిగారు. 
– వీళ్లు చేయలేరు..ఒక వేళ చేసినట్లు అంకెల్లో చూపాలనుకున్నా..ఒక్క సీట్లలోనే కాదు...మొత్తం అన్ని రంగాల్లో జగన్‌ గారు చేశారు. 
– సోషల్‌ ఇంజినీరింగ్‌లో వారు మరగుజ్జులుగా మిగిలిపోవాల్సిందే. 

Back to Top