పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలి 

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి అని, ఆయన శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. కెమెరా ఆన్‌ చేసి యాక్షన్‌ అనగానే చేయడానికి ఇది కాదన్నారు. గోతులు పూడ్చి ఫొటోలు దిగి చేసే ఆందోళనలతో ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే రూ.2,200 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ చీప్‌ పబ్లిసిటీ మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. పవన్‌ స్థాయికి మేం దిగజారాల్సిన అవసరం లేదని తెలిపారు. పవన్‌కు భయపడి రోడ్లు వేశామని అనుకోవడం వారి భ్రమ అన్నారు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుందని వ్యాఖ్యానించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదని సజ్జల స్పష్టం చేశారు.
 

Back to Top