మన కోసం మళ్లీ జగనన్నే రావాలి

సామాజిక సాధికారతతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేశారు: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను అక్కున చేర్చుకున్న నాయకుడు జగనన్న:  డిప్యూటీసీఎం నారాయణస్వామి

పేదల పాలిట దేవుడు లాంటి వాడు జగనన్న:  మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

గ్రామస్వరాజ్యాన్ని మన కళ్లెదుట చూపెడుతున్నారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి:  ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు, పేదలకు,మహిళలకు అన్నింటా పెద్దపీట వేశారు జగనన్న:  ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ 

నంద్యాల నియోజక వర్గంలో సామాజిక సాధికార యాత్రకు బ్ర‌హ్మ‌ర‌థం

నంద్యాలలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వేలాది జనం తరలివచ్చారు. నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల నుంచి అధిక సంఖ్యలో జనం వచ్చారు. బీసీ,ఎస్టీ,ఎస్సీ,మైనార్టీ వర్గాల ప్రజలు భారీగా హాజరయ్యాయి.
శిల్పారవిచంద్ర కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీసీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామిలు, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు రవిచంద్ర,హఫీజ్‌ఖాన్‌లు ప్రసంగించారు. సభ అసాంతం జనం కట్టుకదలకుండా ఉండటం విశేషం 

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
–సామాజిక సాధికారత అన్నది ఏడు దశాబ్దాల పాటుగా ఒక నినాదంగానే ఉండిపోయింది. 
–జగనన్న ముఖ్యమంత్రి కాగానే అది ఒక విధానంగా మారింది. 
–మాటలకే పరిమితమైన సాధికారతను..ఆచరణలో నిజం చేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
–ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో 25మంత్రులుంటే అందులో 17మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు. 
–అదే వర్గాలకు చెందిన మరో నలుగురు డిప్యూటీ సీఎంలు. 
– ఈ తీరులో సామాజికసాధికారతను సాధించి చూపిన జగనన్నను మించిన ప్రజానాయకుడు ఇంకొకరు ఉంటారా?
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.
– బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను కష్టకాలంలో ఆదుకున్న నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి.
– రాబోయే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలి. 
–మన కోసం, మన పిల్లల మంచి భవిష్యత్తుకోసం జగనన్న కావాలి..జగనన్నే మళ్లీ రావాలి.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి
–జగనన్న ప్రతి పేదవాడి గుండెలో ఆత్మబంధువుగా ఉన్నాడు. మాటిస్తే తప్పని నాయకుడు జగనన్న.
–అన్ని కులాలను దగ్గరకు తీసుకున్న ప్రజానాయకుడు జగనన్న. 
–ఇచ్చిన మాట మీద ఏనాడు నిలబడని సీనియర్‌ పొలిటీషియన్‌ చంద్రబాబు. సిగ్గు పడాలి.
–ఈరోజు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు జగనన్న.
–ఆయా వర్గాలను వాడుకుని, తర్వాత అవమానించి, చులకనగా చూడటం చంద్రబాబు నీచరాజకీయం.
– ఈరోజు బీసీలను, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను అధికార పదవుల్లో పెద్దపీట వేసి కూర్చోపెట్టిన మన నాయకుడు జగనన్న.
– విద్యా,వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి..పేద వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
– మహిళా సాధికారత విషయంలో జగనన్న ఎంతో చేశారు. ప్రతి మహిళను స్వంత అక్కాచెల్లెమ్మలుగా చూస్తున్నారు. వారి మొహాల్లో నవ్వులు చూడాలని ...వారికి ప్రత్యేకించి  సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. 
–ఇంటి స్థలాలు వారి పేరునే రిజిష్టరు చేసి పట్టాలిచ్చారు.
– చంద్రబాబును నమ్మితే..మనల్ని మనం మోసం చేసుకోవడం. మన సంక్షేమం, అభివృద్ధికి చేటుచేసుకోవడం.
– చంద్రబాబు మన బడుగు,బలహీనవర్గాలకు ఏం చేశాడో చూడండి. జగనన్న ఏం చేశాడో చూడండి తేడా మీకే తెలుస్తుంది. జగనన్నతో పోలికే లేని దరిద్రనాయకుడు చంద్రబాబు.
– జగనన్న కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల వర్గాలన్నీ కలిసి నిలబడాలి. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి.
– జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాల్లో వెలుగులు.

మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
–ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారు. 
–ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశాం. అటు ఎన్టీ ఆర్, వైఎస్సార్‌లను కలిపితే  జగన్‌మోహన్‌రెడ్డి. 
–ప్రజా సంక్షేమం విషయంలో ఆ ఇద్దరి కన్నా మరో నాలుగు అడుగులు ముందుకు వేశారు జగనన్న.
–జగనన్న తన సుదీర్ఘపాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు. పేదల కన్నీళ్లు తుడిచారు. వారికి భరోసా ఇచ్చారు. ధైర్యాన్ని నూరిపోశారు. 
–ఆయన అధికారంలోకి రాగానే పేదలకోసం అనుక్షణం పనిచేస్తున్నారు. వారి ఆర్థిక, సామాజిక స్థాయి పెంచేందుకు నవరత్నాలు అందిస్తున్నారు.
–ఏ ప్రభుత్వం చేయని తరహాలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించి హామీలను పక్కాగా అమలు చేశారు.
– మంత్రివర్గం మొదలు కొని ఎంపీటీసీ వరకు అన్నింటిలోను పెద్దపీట వేశారు.
–139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా పదవులు ఇచ్చి చరిత్రలో నిలిచారు. 
–ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన,మైనార్టీ, పేదలకు ఎంతో మంచి చేశారు జగనన్న. 
–2024లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితే, మన జీవితాల్లో రెట్టింపు వెలుగులు వస్తాయి.

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి
–గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని మన కళ్ల ముందు పెట్టారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. గడప గడపకు ప్రజాపాలనను దరి చేర్చారు. –పేద,బడుగు,బలహీనవర్గాలు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుకునేలా చేయడం ద్వారా ..వారి ఆర్థిక,సామాజిక స్థాయిని పెంచారు జగనన్న.  
–అగ్రవర్ణాలతో సమానంగా అణగారిన వర్గాలు ఎదిగేందుకు.. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎన్నో అవకాశాలు..బడుగు,బలహీనవర్గాలు పేదరికం నుంచి బయటపడేందుకు ఎన్నో సంక్షేమపథకాలు..జగనన్న సమర్ధపాలనకు నిదర్శనాలు.
– తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు,బీసీ,ఎస్సీ,ఎస్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తారు.
– ఆయా వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగానే వాడుకుని, వదిలేసే రకం చంద్రబాబు.
– ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.
– నంద్యాలలో మెడికల్‌ కాలేజీ రాకుండా అడ్డుకున్నవారు టీడీపీ వారు. ఈరోజు నంద్యాలలో మెడికల్‌ కాలేజీ వచ్చింది. 150మంది విద్యార్థులు చదువుకుంటారు. 
– నంద్యాల జిల్లా అయింది. అనేక ప్రభుత్వకార్యాలయాలు నూతన భవనాలతో కళకళలాడుతున్నాయి.

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
–ఈ నాలుగున్నరేళ్లలో భారతదేశంలో ఎక్కడా లేని సంక్షేమపథకాలు అమలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
– గ్రామ,వార్డు సచివాలయాలతో చరిత్రను సృష్టించారు జగనన్న.
– మనం పేదరికం నుంచి బయటకు రావాలి. కష్టాల నుంచి బయటకు రావాలి. నష్టాలనుంచి బయటపడాలి. 
 – మనలాంటి బడుగు,బలహీన,పేదల ప్రజలకు సాయం అంటూ చేస్తే దేవుడే చెయ్యాలి. ఆ దేవుడు లాంటి మనిషి జగనన్న మనకు అన్ని విధాలా సాయం చేస్తున్నాడు. నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు.
–చంద్రబాబు హయాంలో ఒక్క స్కూలు కట్టలేకపోయాడు చంద్రబాబు.
– 34వేల స్కూళ్ల రూపురేఖలు మార్చేసాడు జగనన్న.
– అమ్మ ఒడి పథకంతో తనే మన పిల్లల్ని చదివిస్తున్నాడు.  ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు మన పిల్లలంటే..అది జగనన్న వల్లనే.
– మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపటి పోటీ ప్రపంచంలో పోటీ పడేలా చదువుల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చాడు జగనన్న.

Back to Top