రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌

విజ‌య‌న‌గ‌రం:  రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవిష్క‌రించారు. బుధ‌వారం మంత్రి జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలో 16.67 కోట్ల రూపాయల తో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) చేతులు మీదుగా రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే స్వ‌చ్ఛ‌త ప‌క్వాడ‌-2023 పోస్ట‌ర్‌ను మంత్రి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు (చిన్నశ్రీను),  రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, జిల్లా కలెక్టర్ డా.సూర్యకుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top