కోడెల మృతికి చంద్రబాబే కారణం

అమరావతి : చంద్రబాబు నాయుడు పెట్టిన అవమానాలతోనే మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఎక్కడా ఉద్దేశ్యపూర్వకంగా కోడెలపై కేసులు పెట్టలేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు  కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను దూషించడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌, రంగా లాంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అందరికి తెలిసిన విషయమేనని రోజా విమర్శించారు. 
 

Back to Top