శ్రీకాకుళం: ప్రజల్ని మోసగించడంలో విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. కళ్లేపల్లిలో 2.6 కోట్ల రూపాయలతో నిర్మించదలచిన వైయస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. నాణ్యత తో కూడిన పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ...దేశానికే ఆదర్శం అయ్యే విధంగా ఇవాళ పాలన సంస్కరణలను అమలు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా భిన్నమైన పాలన తీసుకు వచ్చాం..స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది..అల్పాదాయ వర్గాలకు సంబంధించి ఇంత వరకూ సొంత ఇంటి కల నెరవేరలేదు. అలాంటి వారి కలలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో నడుస్తున్న సర్కారుకే చెందుతుంది. మొదట్లో భూమిని ఆహార పండించడం కోసమే ఉపయోగించారు. తరువాత కాలంలో నివాస యోగ్యత కు అవసరం అయ్యే విధంగా, తరువాత కాలంలో పారిశ్రామికీకరణకు వాడుకుంటున్నారు. కానీ భూమి లేని నిరుపేదల అవసరాలన్నవి తీరలేదు. ప్రతి ఏడూ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట పండగ చేసుకుంటున్నాం.కానీ మా బతుకుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు అని బాధ పడే వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉండిపోయింది. తినడానికి తిండి లేక, వైద్యం చేయించుకునేందుకు మంచి ఆసుపత్రి లేక,అనారోగ్యంతో ఈసురోమని ఉండేవారికి ఉపశమనం ఇవ్వాలని భిన్నమైన పరిపాలనా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. ప్రజలందరికీ ప్రాథమిక అవసరాలు తీర్చాలి అని,ఎన్నికల ముందు మ్యానిఫెస్టో రూపొందించి, దాదాపు 99 శాతం అమలు చేశాం. ఆ రోజు ప్రతిపక్షాలు ఇదంతా వృథా అని హేళన చేశారు. పేద కుటుంబాల కోసం వారు ఎప్పుడూ ఆలోచన చేసింది లేదు. ప్రాథమిక హక్కుల సాధనకు కోర్టులకు వెళ్లి సానుకూల ఉత్తర్వులు లేదా తీర్పులు తెచ్చుకోవచ్చు. ఆదేశిక సూత్రాలు మాత్రం ప్రభుత్వాలు పాటించాలి..మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.. ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక జీవిస్తున్న వారికి కోసం ప్రభుత్వాలు తోడుగా ఉండాలి..దాదాపు 12 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చాం. ఎన్ని కష్ట,నష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం సీఎం వైయస్ జగన్ ది.అదే చంద్ర బాబు 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారు. రాష్ట్రం విడిపోయాక అనుభవం ఉంది అని అందరూ అధికారం ఇస్తే..ప్రజలను ఆయన మోసం చేశారు. మహిళ సంఘాలకు మోసం చేశారు. వారి రుణాలు తీరుస్తామని చెప్పి, బ్యాంకులకు ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పి ఎన్నికలయ్యాక ఆ సంగతే మరిచిపోయారు. ఆ రోజు ఎన్నికల వేళ అందరూ ఆయన్ను నమ్మి ఓట్లు గుద్దారు. కానీ ఆయన గద్దెనెక్కాక ఇచ్చిన మాట మరిచిపోయి నట్టేట ముంచారు. కానీ ఇప్పుడు అదే మహిళా సంఘాలకు సీఎం వైయస్ జగన్ చెప్పినట్టుగా మూడు దఫాల్లో చెల్లించారు. మరోవిడత ఉంది. ఆ మొత్తాలను జనవరిలో చెల్లిస్తాం. ఇవాళ అభివృద్ధి లేదు లేదు అని కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పల్లె వాకిట కట్టిన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కాదా ? సచివాలయం అభివృద్ధి కాదా ? రైతు భరోసా కేంద్రం అభివృద్ధి కాదా ? ఇవి ఏవీ టీడీపీ నేతలకు కనిపించవు. వారి దృష్టిలో అభివృద్ధి అంటే నీరూ - చెట్టు పేరు చెప్పి జేబులు నింపుకోవడం. అభివృద్ధి పేరిట ఊరి మీద పడి జనం సొమ్ములు తినే వారికి రోజులు లేవు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై ఏం విమర్శలు చేయాలో తెలియక..నిత్యావసరాలు,పెట్రోల్,డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి అంటున్నారు.. అది నిజం కాదు. ధరల విషయమై వాకబు చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికే పోయి కొనుగోలు చేద్దాం.ఈ విషయమై ఒక్కసారి పక్క రాష్ట్రాలను పరిశీలించండి. అంతటా ఉన్న రేట్లు కనుక్కోండి.. అయినా ధరలన్నవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. వీటిపై ప్రచారం చేసే వారు ఇతర ప్రాంతాలకు సంబంధించిన సమాచారం సేకరించాకే మాట్లాడగలగాలి. పథకాలు అందించే క్రమంలో ఒక్క వైఎస్ఆర్సీపీ కార్య కర్త అయిన లంచం తీసుకున్న దాఖలాలు లేవు. పేదల ఆత్మ గౌరవం తగ్గకుండా,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా భావించి పొందుతున్నారు. వై.యస్.జగన్ ముఖ్యమంత్రి గా ఉంటేనే ఇవి అని సాధ్యం అయ్యాయి. మళ్ళీ ఆయనకు అధికారం ఇస్తేనే మళ్ళీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. వైయస్ జగన్ కి అధికారం ఇస్తే ప్రజల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం ఇస్తే అవి తన మనుషుల ఖాతాల్లోకి డబ్బు జమ చేసుకున్నారు. మళ్ళీ చంద్రబాబుకు మీరంతా ఓటు వేస్తే బోడి గుండు మిగులుతుంది. అన్ని రంగాల్లో ఇవాళ అభివృద్ధి సాధ్యం అయింది. ఇదంతా కేవలం నాలుగున్నరేళ్ల కిందట వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లనే..సాధ్యం అయింది. పాకిస్థాన్ లో చిక్కుకున్న మత్స్యకారులను స్వదేశానికి రప్పించేందుకు సీఎం వైయస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, వారికి అన్ని సదుపాయాలూ కల్పించి ఇక్కడికి తీసుకు వచ్చారు. అదే సమస్య చెప్పుకోవడం కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే, మీ తోక కత్తిరిస్తా అని బెదిరించారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు దిట్ట అని మరోసారి నిరూపణ అయింది. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా వైద్య శాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, ఎంపిపి అంబటి నిర్మల, జడ్పీటిసి రూప్పా దివ్య, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు, ఎఎంసి చైర్మన్ ముకళ్ళ తాత బాబు, వైయస్ఆర్‌సీపీ నాయకులు శీమ్మ రాజశేఖర్, గంగు నరేంద్ర, చల్లా రవి కుమార్, అల్లు లక్ష్మి నారాయణ, ముకళ్ళ సుగుణ, చిట్టి రవి కుమార్, తాంగి చంద్ర శేకర్, గెదల చంగల్ రావు, ముకళ్ల జయనంధ, ఇప్పిలీ శ్రీనివాస్, సురాడ సూర్యం, గురువులు, సత్య నారాయణ, నక్క శంకర్, పెద్దిన ఉమా, రావాడ మోహన్ రావు, బాన్న నర్సింగ రావు, ఇప్పీలి సత్య నారాయణ, కనుగుల అప్పల నాయుడు, అప్పన్న స్వామి తదితరులు పాల్గొన్నారు.