సీఎం వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీస్‌

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో రాఖీ పౌర్ణ‌మి వేడుక‌లు

తాడేప‌ల్లి:  రక్షాబంధన్‌(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డికి  బ్రహ్మకుమారీస్‌ స్పిరిచ్యువల్‌ ఆర్గనైజేషన్‌... బ్రహ్మకుమారీస్‌ సోదరీమణులు జయ, పద్మజ, రాధలు రాఖీ క‌ట్టారు.
అలాగే బ్రహ్మకుమారీస్‌ ప్రధాన కార్యాలయం మౌంట్‌ అబూలో సెప్టెంబరులో జరగబోయే గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని  బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధులు ఆహ్వానించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు క‌లిసి రాఖీ క‌ట్టారు. వారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా పలకరించి రాఖీలు క‌ట్టించుకున్నారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top