చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌, ఒక ఫ్రాడ్‌స్టర్‌ అని తేలింది

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌
 
స్కిల్ స్కాంతో యువతను మోసం చేసిన బాబు

 స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం సుస్పష్టం

 ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోపిడి చేశారు

 అందుకే చంద్రబాబును అరెస్టు చేశారు

 ఎంపీ  మార్గాని భరత్‌ స్పష్టీకరణ

స్కిల్‌ స్కామ్‌లో నారా లోకేశ్‌కు ప్రమేయం ఉంది

దానిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి

 ఈ కేసులో ఉన్న వారందరినీ బయటకు తీసుకురావాలి

 ప్రజాధనం కొల్లగొట్టడం అత్యంత దారుణం- నేరం

ప్రెస్‌మీట్‌లో ఎంపీ మార్గాని భరత్‌ వెల్లడి

తాడేప‌ల్లి:  చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌, ఒక ఫ్రాడ్‌స్టర్‌ అని తేలింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ మండిప‌డ్డారు. రెండెకరాలతో రాజకీయాలను ప్రారంభించిన చంద్రబాబు ఇవాళ‌ లక్ష కోట్లకు ఎదిగాడని, తన పదవులను అడ్డు పెట్టుకోని కోట్లాది రుపాయలను అక్రమంగా సంపాదించారని మండిపడ్డారు.  శ‌నివారం మార్గాని భ‌ర‌త్ మీడియాతో మాట్లాడారు.

  
ప్రజలే సిగ్గు పడేలా..:
    ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రజలంతా సిగ్గు పడే విధంగా చంద్రబాబునాయుడు ప్రవర్తించారు.
    రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌గా, ఒక ఫ్రాడ్‌స్టర్‌గా.. షెల్‌ కంపెనీలు పెట్టించి, ప్రభుత్వ ఖజానా నుంచి అక్షరాలా రూ. 371.25 లక్షలు ఏ రకంగా స్వాహా చేశారో చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. 70 నుంచి 80 షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను ఎన్‌రూట్‌ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రాష్ట్రంలో యువతను ఏ విధంగా దగా చేశాడనేది అందరూ గుర్తించాలి.

యువత పేరుతో దోపిడీ:
    నిజానికి తాము రాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధమైన ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ కంపెనీ ప్రకటించింది. షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి, వైట్‌ కాలర్‌ నేరాలకు పాల్పడుతూ, నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఖజానా నుంచే నేరుగా నిధులు కొట్టేశారు. యువత పేరు చెప్పి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా స్కిల్‌గా అవినీతి చేశారు. మీరు చేసిన దోపిడికి తగిన ఫలితం పొందక తప్పదు.

యథేచ్ఛగా మనీ లాండరింగ్‌:
    సీమెన్స్‌ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం, ఆ సంస్థ 90 శాతం నిధులు సమకూరిస్తే, ప్రభుత్వం మిగిలిన 10 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. అయితే సీమెన్స్‌ కంపెనీ తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టకున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏకంగా తన వాటాగా రూ. 317.25 లక్షలు విడుదల చేసి, షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు.
    షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ఆ నిధులను దిగమింగారు. తాను నోరు తెరిస్తే.. సత్యహరిశ్చంద్రుడిని అని చంద్రబాబునాయుడు చెప్పుకుంటుంటారు. ఆయన ఈ రకంగా షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ఏ విధంగా నిధులు దిగమింగారో చూడమని ప్రజలను కోరుతున్నాను.

ప్రజల సానుభూతి కోసం..:    
    నిజానికి చంద్రబాబు మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్నింటిలో ఆయన స్టే తెచ్చుకున్నారు? అనేది కూడా ఆలోచించండి.
చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్కామ్‌లమయం. ప్రతి చోటా దోపిడి. కానీ తాను నిప్పు లాంటి మనిషిని అని చెబుతుంటారు. మరి ఈ స్కిల్‌ స్కామ్‌కు ఏం సమాధానం చెబుతారు?
    ఇన్ని అక్రమాలు చేసినా, తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని దిగమింగిన వారిని, అరెస్టు చేయకుండా, అందలం మీద కూర్చోబెట్టాలా?
    ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. ఇక్కడ రాజధాని పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డాడు.
    ఇక పోలవరం ప్రాజెక్టును తామే కడతామంటూ, కేంద్రం వద్ద లాలూచి పడి ఆ ప్రాజెక్టు పనుల్లోనూ ఎంతో అవినీతి చేశాడు. చివరకు సాక్షాత్తూ ప్రధాని మోదీ సైతం.. చంద్రబాబు దోపిడిని ప్రస్తావించారు.
ప్రజాధనం లూటీ చేయడం నేరం కాదా? దమ్ముంటే సమాధానం చెప్పండి.
    సింపతీ కార్డు వాడుతున్న చంద్రబాబు, తాను చేసిన నేరం నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.

లోకేశ్‌ పాత్ర బయట పెట్టాలి:
    ఈ స్కామ్‌లో చంద్రబాబు కొడుకు, లోకేశ్‌కు ప్రమేయం ఉందని తెలుస్తోంది. కాబట్టి, దానిపై కూడా పూర్తి వివరాలు రాబట్టాలి. ఈ కేసులో దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలి. దీని వెనక ఉన్న వారందరి బండారం బయటపెట్టాలి. ఈ స్కామ్‌ను పార్లమెంటులో కూడా ప్రస్తావించి, వాస్తవాలను అందరికీ తెలియజేస్తాం.

 ఆ అవసరం మాకు లేదు:
    చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉంది. ఆ ప్రొటోకాల్‌ ప్రకారమే, తెల్లవారిన తర్వాతే, ఆయనను నిద్ర లేపి, మాట్లాడారు.
చట్టం ముందు అందరూ సమానమే. ఎవరూ అతీతులు కారు.

రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం ఎవరికీ లేదు. 
    ప్రభుత్వం చెబుతున్నట్లు, సీమెన్స్‌ కంపెనీ 90 శాతం ఖర్చు చేయాలి. కానీ ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే, ప్రభుత్వ వాటాగా 10 శాతం రూ. 371.25 కోట్లు విడుదల చేసి, షెల్‌ కంపెనీల ద్వారా వాటిని కొట్టేశారు. నూటికి నూరు శాతం ఇది ఒక పెద్ద స్కామ్‌. చంద్రబాబు ఒక పెద్ద ఫ్రాడ్‌. స్కామ్‌స్టర్‌.

Back to Top