ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

 పూతలపట్టు శాసనసభ్యులు ఎం ఎస్ బాబు

పొలకల గ్రామంలో వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మం 

పూత‌ల‌ప‌ట్టు: ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే వైయ‌స్ఆర్‌ సీపీ లక్ష్యమని ఎమ్మెల్యే  ఎంఎస్ బాబు అన్నారు. గురువారం ఐరాల మండలం పొలకల సచివాలయం-1 ప‌రిధిలో వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ, అభివృద్ధి క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంత‌కు ముందు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్క‌రించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..పార్టీలకు అతీతంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు తెలిపి, మరలా వైయ‌స్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకు రావాలని కోరారు.   

తాజా వీడియోలు

Back to Top