వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహం

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి

సీఎం వైయ‌స్‌ జగన్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ భేటీ 

 తాడేప‌ల్లి: రాష్ట్రంలో వెనకబడిన  ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహిస్తు­న్నామని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామిక­వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశ­మయ్యారు.

కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై వారు చర్చించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సజ్జన్‌ జిందాల్‌ వివరించారు. జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌­లో ఈ ప్లాంటు కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చేనెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమ­వుతున్నామన్నారు. సౌరవిద్యుత్‌ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్‌ సీఎంకు వివరించారు. 

Back to Top