న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. సీఎం వైయస్ జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కేంద్రమంత్రులు సీఎంకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఏపీవ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టాయి. నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం, క్రీడా పోటీలు, కేక్ కటింగ్‌లతో కోలాహలంగా సంబరాలు జరుపుతున్నారు.