’నిఘా‘  ప్రత్యేక యాప్ ఆవిష్కరణ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను నివారించేందుకు రూపొందించిన నిఘా పేరుతో ప్రత్యేక యాప్‌ను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక యాప్‌ను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికలు, ఈ నెల 27న పంచాయతీ మొదటి విడత, 29న పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top