సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న వైస్ చాన్స్‌ల‌ర్లు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఇటీవ‌ల నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్‌ చాన్స్‌లర్‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.  వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను క‌లిశారు. కడప డాక్టర్‌ వైయస్ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ వీసీగా నియమితులైన బానోత్‌ ఆంజనేయ ప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే.వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డిలు సీఎంను క‌లిశారు. సమావేశంలో  ఉన్నతవిద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Back to Top