నాటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని నాటా ప్రెసిడెంట్, సభ్యులు ఆహ్వానించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను నాటా ప్రెసిడెంట్ డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కొర‌స‌పాటి, ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ప్ర‌తాప్‌రెడ్డి భీమిరెడ్డి, నాటా స‌భ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా 2023 జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డాలస్‌లోని డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జ‌రగ‌నున్న‌ నాటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేశారు. 

Back to Top