ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించబోతుంది

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించబోతుందని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సున్నపురాళ్లపల్లి వద్ద స్టీల్‌ప్లాంట్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ఎన్నాళ్లో వేచిన ఉదయం...అన్నట్లుగా ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఇవాళ ఫలించబోతోంది. ఆ రోజు 2008వ సంవత్సరంలో మనందరి ప్రియతమ నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  ఈ ప్రాంతానికి ఉక్కు పరిశ్రమ తీసుకురావాలని ఇదే జమ్ములమడుగు నియోజకవర్గంలో ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేశారు. మహానేత అకాల మరణం తరువాత ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లు పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో 2014న మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు  కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయో చూశాం. మన జిల్లా సరిహద్దు కంబాలదిన్నెకు వచ్చి గతంలో శంకుస్థాపన చేశారు. ఆ పరిశ్రమకు నీరు, భూమి కేటాయింపులు, ముడి సరుకుల కేటాయింపులు చేయలేదు. బహిరంగ సభ, ఫైలాన్‌ కట్టేందుకు అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎన్నికల సమయంలో మన సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దు..మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉక్కు పరిశ్రమకు శంకు స్థాపన చేస్తామని మాట ఇచ్చారు. శంకుస్థాపన సమయానికే నీటి కేటాయింపులు చేశారు. దాదాపు 320 ఎకరాల భూమి కేటాయింపులతో పాటు ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కంపెనీకి భూములు అప్పగించారు. ఎంవోయూలు కూడా పూర్తి అయ్యాయి. ఇక శరవేగంగా పనులు మొదలుకావడమే తరువాయి. కచ్చితంగా మూడేళ్లలో ఈ పరిశ్రమను పూర్తి చేసి జిల్లాకు అంకిత ఇవ్వబోతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డికి రెండు కళలు ఉండేవి. ఒకటి మన ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావడం, ఆ కలను ఆయన నెరవేర్చారు. రెండోవది పెద్ద ఎత్తున పరిశ్రమను తీసుకురావాలని వైయస్ఆర్‌ తలంచారు. ఈ కలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. ఇచ్చిన మాట  నిలబెట్టుకున్నందుకు, ఇవాళ శంకుస్థాపన చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..

Back to Top