విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.క్కడ అత్యధికంగా 15 వేల ఉద్యోగాలు ఇవ్వగలం అనుకున్నాం. కానీ అంత కంటే ఎక్కువే వచ్చాయి. యువత నుంచి వచ్చిన స్పందన, పరిశ్రమల నుంచి వచ్చిన ప్రోత్సాహం ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. నిన్న తొలిరోజు 13,663 ఉద్యోగాలు రాగా, ఇవాళ (ఆదివారం) సాయంత్రం వరకు 8,554 ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు రోజులు కలిపి మొత్తం 22,217 ఉద్యోగాలు యువతకు ఇచ్చి, రికార్డు సాధించాం. గరిష్ట వార్షిక వేతనం రూ.12.50 లక్షలు కాగా, కనీస వేతనం నెలకు ఎక్కడా రూ.15వేలకు తగ్గలేదు. అలాగే వార్షిక వేతనం రూ.10 లక్షలు కూడా చాలా మందికి రానుంది ఉద్యోగ అవకాశాలు పొందిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పర్వదినంగా నేను భావిస్తున్నాను. మీ అందరి ముఖాల్లో సంతోషం సీఎంగారికి కూడా ఎంతో సంతోషదాయకం. ప్రతి ఒక్క కుటుంబంలో విజ్ఞానజ్యోతుల వెలుగు కోసం ఆయన ఆరాటపడుతున్నారు. కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు యువతకు ఒక వరంగా మారాయనడంలో సందేహం లేదు. సీఎంగారి ఆశయాలకు అనుగుణంగా మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సామాజిక బాధ్యతగా కార్పొరేట్ కంపెనీలకు యువతకు కనెక్ట్ చేసే విధంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. మీరు మరింత ఎదగాలి: విద్యార్థులకు ఒక విషయం మనవి. ఇప్పటి వరకు మీరు విద్యార్థులు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీ జీవితాలు మారబోతున్నాయి. మీరు భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎదగాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఎందరికో ఉద్యోగాలు ఇవ్వాలి. మీ ప్రస్థానంలో సవాళ్లు ఎదురవుతాయి. అయితే ఎక్కడైనా మీ వృత్తి ధర్మం మర్చిపోవద్దు. సమస్యలు, సవాళ్లు చూసి బెదిరిపోవద్దు. కళాశాలల్లో మీరు ఆర్జించిన విజ్ఞానం వాస్తవిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నది గుర్తించండి. మీకు నిబద్ధత ఉండాలి. అలాగే శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలి. సమస్య నుంచి గట్టెక్కడానికి సమయస్ఫూర్తి, పాజిటివ్‌నెస్, శ్రద్ధ, ఏకాగ్రత ఉంటే ఊహించని విజయాలు సాధిస్తారు. నైతికత. విలువలు: యువతను ప్రోత్సహించాలని అందరూ భావిస్తారు. మీరు అభివృద్ధి చెందినప్పుడు పెద్దలు ఎంతో గర్వపడతారు. మీ నైతికత, విలువలే మిమ్మల్ని ఎదిగేలా చేస్తాయి. అప్పుడే అవధులు లేని అవకాశాలు వస్తాయి. విద్యార్థి దశ నుంచి బిందువులా మొదలయ్యే మీ ప్ర«స్థానం, భవిష్యత్తులో ఒక సెలయేరులా మారాలి. ఆ దిశలో మీరు ఎదగాలి. ఒక వ్యక్తిగా ప్రారంభమైన మీ పయనం, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేలా కొనసాగాలి. ఇవాళ అగ్రస్థానంలో ఉన్న సంస్థలన్నీ ఒకనాడు ఒక సాధారణ ఉద్యోగ స్థాయి నుంచే ఎదిగాయి. మీరు కూడా అలాగే ఎదగాలి.. అది మీ చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోకండి. మహిళా ఆర్థిక స్వావలంబన: జాబ్‌మేళాలో ఎక్కువగా యువతులకే ఉద్యోగాలు రావడం అనేది చాలా సంతోషం. మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలి. ఆర్థికంగా వారికి పట్టు రావాలి. అప్పుడే మీకు కుటుంబంలో, సమాజంలో బలాన్ని పెంచుతుంది. ఇంకా దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాం. అలాగే అనాధలకూ ఉద్యోగాలు కల్పించాం. అందుకు ఎంతో సంతోషం కలుగుతోంది. ఇవాళ మీకు వచ్చిన ఈ అవకాశం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదబలం. కాబట్టి మీ ఆనందాన్ని వారితో పంచుకొండి. వారు మరింత గర్వించేలా మీరు ఎదగాలి. నిరుత్సాహం వద్దు: ఇక్కడ ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలకు ఎంపిక కాని వారు నిరుత్సాహపడొద్దు. మీకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తాము. దానికి మీరు హాజరై నైపుణ్యం పెంచుకొండి. భవిష్యత్తులో నిర్వహించే జాబ్‌మేళాలో మీకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుంది. మరో 1402 మంది: 22,217 ఉద్యోగాలు కాకుండా, ఒక 1402 మందిని కొన్ని ఐటీ కంపెనీలు, వారి వారి నిబంధనల ప్రకారం రెండో విడత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అప్పుడు వారిలో ఎంత మంది ఎంపిక అవుతారో.. వారికి కూడా అభినందనలు. అప్పుడు మొత్తం ఉద్యోగాలు 23 వేలు కూడా దాటొచ్చు. వారందరికీ ధన్యవాదాలు: ఈ కార్యక్రమంలో సహకారం ఇచ్చిన ఏయూ వీసీ స్టీఫెన్‌తో పాటు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి వైయస్సార్‌సీపీ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి 208 కంపెనీలు వచ్చాయి. వాటి యాజమాన్యాలకు ప్రత్యేకంగా «ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.