తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతిమరుపుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నిన్న ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము పరిచయ కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి మాన్యవర్ శ్రీ రామనాథ్ కోవింద్ గారిని పట్టుకుని కోవిడ్ అన్నారు అల్జీమర్స్ చంద్రం బాబాయ్. చిప్ అరికాలును దాటి పాతాళానికి పడిపోయిందడర్రా! ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారు. మీ చంద్రబాబు మీటింగ్ లో అయితే కుర్చీలు ఎత్తుకెళ్తారు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మ్యాజిక్ చేయాలనుకుంటే ఎలా? ఆంధ్రజ్యోతిని 'అంధ' మీడియాగా మార్చేశావు కదయ్యా! అంటూ అంతకు ముందు మరో ట్వీట్ చేశారు.