తాడేపల్లి: గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతలను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 'గ్రామ వాలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సీఎం వైయస్ జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్' అంటూ విజయసాయిరెడ్డి ఓ ఫొటోను పోస్ట్ చేశారు.