ఇదేదో దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం కాదు బాబూ? 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి:  కరోనా వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం లాంటిది కాదు చంద్రబాబూ అంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.  దోమలను నియంత్రించావా? వైరస్సూ అంతే. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నవాడివి నీకేం తెలుసని జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు? ప్రజల గురించి మొసలి కన్నీళ్లు కార్చవద్దు. కరోనా కట్టడిలో రాష్ట్రమే ముందు నిలుస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 ఎల్లో మీడియాకు ఆ దమ్ముందా?
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ నిధులు1400 కోట్లు విడుదల చేశారు సిఎం గారు. విద్యా దీవెన కింద 4 వేల కోట్లు ఇచ్చారు. ఇందులో బాబు హయాంలోని బకాయిలూ ఉన్నాయి. ప్రజలు ఎంత నిశ్చింతగా ఉన్నారో చూపించే దమ్ము ఎల్లో మీడియాకు లేదు. కుల పెద్ద ఏదో లేఖ అని వదిలితే రోజంతా అదే చెత్త చూపించారంటూ మరో ట్వీట్‌ చేశారు.

Back to Top