ప్రతిభ, నిజాయితీలు కనబర్చినందుకు పతకాలు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవార్డులు అందుకున్న పోలీస్ అధికారుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అభినందించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 18 పోలీసు మెడల్స్ కు ఎంపికైన అధికారుల, సిబ్బందికి అభినందనలు. విధి నిర్వహణలో ప్రతిభ, నిజాయితీలు కనబర్చినందుకు పతకాలు దక్కాయి. మెడల్స్ పొందిన స్ఫూర్తితో పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచుతారని ఆశిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు.

అందరికీ కష్టాలు ఉంటాయి.. కన్నీళ్లు ఉంటాయి... జీవితం అక్కడితో ఆగిపోదు... సంతోషకరమైన జీవితం అనేది నీ దగ్గరకు రాదు... నువ్వే దానిని సంతోషంగా తీర్చిదిద్దుకోవాలి అంటూ అంత‌కు ముందు ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top