ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల నుంచి పీఎస్‌ఏ ప్లాంట్‌ల వరకూ ఇంజనీరింగ్‌ పట్టభద్రులతోనే..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి జగన్ గారి ప్రభుత్వం చర్యలు చేపట్టింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల నుంచి పీఎస్‌ఏ ప్లాంట్‌ల వరకూ ఇంజనీరింగ్‌ పట్టభద్రులతోనే నిర్వహించేలా మల్టీ టాస్క్‌ టెక్నీషియన్స్‌ విధానాన్ని అమల్లోకి తెస్తోంద‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రతి మహిళా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
మహిళల భద్రత కోసం రూపొందించిన 'దిశ' అమలుతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకోనుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు పేర్కొన్నారు. ఇప్పటివరకు 70,00,520 మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, ప్రతి మహిళా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని  విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్‌లో సూచించారు.

తాజా వీడియోలు

Back to Top