మందడం దీక్షను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు మాలోకం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: రియల్ ఎస్టేట్ విలువ పడిపోయిందనే ఏడుపుతో జరుగుతున్న మందడం దీక్షను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు మాలోకం అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
చేశారు. పెయిడ్ ఆర్టిస్టులు, మీవాళ్లతో కాకుండా జనం అంతా పాల్గొనే నిరసన అయితే జిల్లాలకు జిల్లాలే కదిలి వచ్చేవి. మీరిలాగే వెయ్యో రోజు జరుపుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

 బాబు అరాచక పాలనలో ఒక్క అనంత జిల్లాలోనే 57 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎలక్షన్లకు 6 నెలల ముందు 111 కోట్ల రుణమాఫీ హామీ ఇచ్చి నేతన్నలను నిండా మోసం చేశాడు బాబు. జగన్ గారు రెండేళ్లుగా 85 వేల కుటుంబాలకు ఏటా 24 వేల ఆర్థిక సాయం అందించి చేనేత రంగానికి ప్రాణం పోశారని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. 

పురుష వారసులు లేని రాజ్యాలను కొట్టేయడానికి ... ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కుట్రలకు వ్యతిరేకంగా రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్, రాణి చెన్నమ్మ వీరోచితంగా పోరాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. డల్హౌసీ సిద్ధాంతానికి అశోక్ పూసపాటి ఆలోచనలకు ఏమైనా తేడా ఉందా? ఇంకా ఈస్టిండియా కంపెనీ సిద్ధాంతాలనే పాటిస్తూ 'కప్పం' కట్టే సామంతరాజు బుద్ధి పోనిచ్చుకోలేదు. మహిళలను వారసులుగా అంగీకరించని ఫ్యూడల్‌ వ్యవస్థ కాదిది. మహిళలకు సమాన హక్కులు కల్పించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం అంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top