పోల‌వ‌రం పూర్తి చేసేది ఆ మ‌హానేత త‌న‌యుడే

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసేది దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఎంపి , విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఆగ‌స్టు  నాటికి 17,760 కుటుంబాల‌కు పున‌రావాస ఏర్పాట్లు పూర్తి చేస్తామ‌న్నారు. ఒక్కో కుటుంబానికి రెండు ఎక‌రాల పంట భూమి, రూ.6.36 ల‌క్ష‌ల ప‌రిహారం అందిస్తున్నామ‌న్నారు. పొల‌వ‌రాన్ని స‌కాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Back to Top