చంద్ర‌బాబు పత్తి గింజల్లాగా సిగ్గులేని వ్యాఖ్యలు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి 

న్యూఢిల్లీ:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా తిప్పికొట్టారు. బాబు ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిల భారం రెండు లక్షల కోట్లపైనే. తక్షణ చెల్లింపులు జరపాల్సిన కాంట్రాక్టర్ల బిల్లులు, విద్యుత్తు కొనుగోళ్ల బాకీలు, ఫీజు రీఇంబర్స్ మెంట్లు కాక ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సినవి. పత్తి గింజల్లాగా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు అంటూ   విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పులిచింతల గేటుపై అబద్ధాన్ని నిజం చేయడానికి ఎల్లో మీడియా, బాబు మనుషులు దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. డ్యాం నింపే ముందు పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను గాలికొదిలేసింది బాబు ప్రభుత్వం. గేట్లు, తీగలు బలహీనంగా ఉన్నాయని 2015లో నిపుణులు ఇచ్చిన నివేదిక బాబు బతుకును బయట పెట్టిందంటూ అంత‌కు ముందు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top