జీడీపీ పెరుగుద‌ల‌కు ఇది అనుకూల సూచిక‌

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: ఆర్‌బీఐ విడుద‌ల చేసిన నివేదిక‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ఒడిదుడుకులు, కరోనా మహమ్మారితో మరింత కుదేలవడం చూసాం. తాజాగా RBI విడుదల చేసిన నివేదిక పరిస్థితి ఆశాజనకంగా మారినట్టు వివరిస్తోంది. చలామణిలో ఉన్న నగదు 26.88 లక్షల కోట్లకు చేరడం శుభ పరిణామం. GDP పెరుగుదలకు ఇది అనుకూల సూచిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

Back to Top